టాలీవుడ్ కోలీవుడ్ లో యాక్షన్ కింగ్ గా పేరు పొందిన అర్జున్ ఇటీవలే తన కూతురు వివాహం చాలా గ్రాండ్గా చేశారు. ముఖ్యంగా తన కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా పేరు సంపాదించు కోలేకపోయింది. ఆ సమయంలో కోలీవుడ్లో హీరోగా ఉన్న ఉమాపతిని ,ఐశ్వర్య ప్రేమించింది. ఈ నటుడు ఎవరో కాదు సీనియర్ నటుడు తంబిరామయ్య కొడుకె ఉమాపతి. వీరిద్దరి ప్రేమకు కూడా అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తంబి రామయ్య తో మాట్లాడి దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించారు.


ఇటీవల ఉమాపతి, ఐశ్వర్య పెళ్లి చాలా గ్రాండ్గా చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు కూడా వీరు వివాహానికి రావడం జరిగింది. ఇలాంటి సమయంలో అర్జున్ తన కూతురు అల్లుడికి కట్నంగా ఎన్ని కోట్లు ఇచ్చారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. సెలబ్రిటీల కుటుంబంలో వివాహమంటే ఖచ్చితంగా కట్న కానుకల గురించి ఒక లెక్క ఉంటుంది. అర్జున్ తన కూతురికి 2 కోట్లు విలువైన ఒక ప్లాట్తోపాటు అలాగే 2కోట్ల రూపాయల నగదు..2 కోట్ల రూపాయల బంగారం తో పాటు పెళ్లిని కూడా చాలా గ్రాండ్ గా చేశారు.


ఇందులో వాస్తవం ఎంత ఉందనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం వైరల్ గా మారుతున్నది. అర్జున్ సౌత్ లో అన్ని భాషలలో కూడా నటించారు .ఎన్నో సినిమాలలో హీరోగా విలన్ గా నటించారు. దర్శకుడుగా తెలుగులో ఒక సినిమాని చేయాలనుకున్న అర్జున్ ఆ ప్రాజెక్టు కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలో కూడా నటిస్తూ ఉన్నారు అర్జున్. అలాగే అర్జున్ అల్లుడు ఉమాపతి కోలీవుడ్లో హీరోగా రాణిస్తూ ఉన్నారు. మరి అర్జున్ కూతురు ఐశ్వర్య వివాహమైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: