బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ఈ అమ్మడు నటుడు జహీర్ తో ప్రేమలో ఉండి పెద్దలకు ఇష్టం లేకున్నా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోనాక్షి బ్రదర్ అండ్ తన తల్లి మరియు తండ్రి సోషల్ మీడియా లో అన్ ఫాలో చేశారు. అయినప్పటికీ వీరిద్దరూ వీటిపై స్పందించకుండా తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ జంట జూన్ 23న పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా సోనాక్షి మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ముంబైలోని తన నివాసం రామాయణ లో ఈ వేడుక జరుపుకున్నట్లు తెలుస్తుంది. అయితే మెహందీ ఫంక్షన్కు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు మరియు ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను జహీర్ స్నేహితుడు ఆలీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవి కాస్త ప్రజెంట్ వైరల్ గా మారాయి.

ఇందులో కుటుంబ సభ్యుల మధ్యలో కొత్తజంట నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వారి పెళ్లి వార్తలని కన్ఫామ్ చేశారు. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. కానీ పెళ్లి విషయాని అధికారికంగా ప్రకటించక పోవడానికి కారణం ఏంటని పలువురు సోనాక్షి ని ప్రశ్నిస్తున్నారు. మరి సోనాక్షి పెళ్లి అనంతరం అయినా తన ఫోటోలను షేర్ చేస్తుందో లేదో చూడాలి. ఇటీవల సోనాక్షి తండ్రి పెళ్లి గురించి స్పందించి తనకు ఇష్టం లేకుండా తన కూతురు ఏ పని చేయదని.. వచ్చేవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: