టాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ రామ్ చరణ్ , ఉపాసన కామినేని  లకి లాస్ట్ జూన్ 20న కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్  అని ముద్దుగా పిలుచుకునే ఆమెకి క్లీంకార కొణిదెల  అని పేరు కూడా పెట్టారు. మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దాదాపు పదకొండేళ్ల తర్వాత రామ్ చరణ్‌, ఉపాసనలకి జన్మించిన ఈ చిన్నారి చిన్నప్పుడేసెలబ్రిటీగా మారింది.చిన్నారి రాకతో ఉపాసన, రామ్ చరణ్‌ల ఆనందం అంతా ఇంతాకాదు. రామ్ చరణ్ రీసెంట్‌గా తన కూతురు గురించి గొప్పగా మాట్లాడాడు. క్లింకార ఇప్పుడిప్పుడే అందరిని గుర్తు పడుతుందని చెప్పాడు. నేను ఇంట్లో లేకపోతే నన్ను చాలా మిస్ అవుతుంది. నేను తనని మిస్ అవుతుంటా. తనని వదలి వెళ్లాలని అనిపించడం లేదు. రెండేళ్లు వచ్చే వరకు ఎక్కువ సమయం తనతోనే గడపాలని అనుకుంటున్నాను. తను స్కూల్‌కి వెళ్లే వరకు టైమింగ్స్ మార్చుకొని క్లింకారతో ఎక్కువ సేపు ఉండేలా ప్లాన్ చేసుకుంటా అని పేర్కొంది.
క్లింకారని వదిలి షూటింగ్స్‌కి వెళ్లడం కష్టంగా ఉంది. నన్ను చూడగానే తన ఫేస్‌లో గ్లో వస్తుంది. ఇంట్లోనే ఉంటే నేనే తినిపిస్తాను. ఇంట్లో అందరు తనకి తినిపించడానికి ఎంతో కష్టపడతారు. నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది. క్లింకారకి రెండుసార్లు నేనే తినిపిస్తాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. క్లింకార రాకతో మెగా ఫ్యామిలీ లో ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూశాం. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడం, చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడం, పవన్ కళ్యాణ్ మంత్రి పదవి అందుకోవడం జరిగింది. అందుకే క్లింకారని ఆ ఇంటి మహాలక్ష్మీగా భావిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే జూన్ 20తో క్లింకార ఏడాది పూర్తి చేసుకుంది.చిన్నారి తన తొలి పుట్టిన రోజుని జంగిల్ థీమ్ తో ఏర్పాటు చేసిన సెట్టింగ్ లో ఘనంగా జరుపుకుంది. పార్టీకి సన్నిహితులు, కుటుంబ సభ్యులు రాగా, వారందరు కలిసి ఫొటోలు దిగారు. ఈ పార్టీలో క్లిన్ కారాను ఎత్తుకొని మురిసిపోయింది ఉపాసన కొణిదెల. డెకరేషన్ నుంచి వచ్చిన గెస్టులకు సర్వ్ చేసిన ఫుడ్, గేమ్స్ అన్నీ అడవి థీమ్ తోనే ఉండటం విశేషం. చిరంజీవి కూతురు శ్రీజ, నటి, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ, సుస్మిత కూడా పార్టీలో సందడి చేశారు. ప్రస్తుతం క్లింకార బర్త్ డే పార్టీకి సంబంధఙంచిన పిక్స్ వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: