టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం దేవర.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. హీరోయిన్గా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేవర సినిమాకి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో ఈ కొరియోగ్రాఫర్ పఠాన్, వార్, ఫైటర్ వంటి చిత్రాలకు అద్భుతమైన సిగ్నేచర్లను సైతం కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి హీరోకి దేవర చిత్రానికి సంబంధించి కొరియోగ్రాఫర్ గా ఒక పాటకు చేయబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. బాస్కో షేర్ చేసిన ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు  ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభను సైతం బాస్కో తెలియజేశారు.


ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సర్ ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. అలాంటి స్టార్ హీరోకు బాస్కో వంటి కొరియోగ్రాఫర్లు కంపోజ్ చేయడం అంటే అది అభిమానులకు ఆనందపరిచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అనిరుద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి మొదటి భాగం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా దేవర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న అన్ని భాషలలో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా వార్-2 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించి లుక్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: