నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి ఏడి 2898' సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఏర్పడిన బజ్ అంతా ఇంతా కాదు. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏకంగా మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచర్స్టిక్ అనే కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు కూడా మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.


 హిందూ పురాణాల ప్రకారం విష్ణువు దశావతారాల్లో కల్కి అవతారం చివరిది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కల్కి అవతారం యొక్క ఊహ జనిత కథ ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా అనేది తెలుస్తుంది. అయితే కల్కి జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబల. శంబల నగరాన్ని అటు ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకంగా చూపించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ శంభాల నగరం గురించి తెలుసుకునేందుకు నేటిజన్స్ అందరు కూడా సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం ఇది. హిమాలయాల్లోని అంతు చిక్కని ప్రదేశమట  శంబల సంస్కృత పదం. డిబేట్లో దీన్ని షాంగరిల్ల అని అంటూ అంటారట.అయితే హిందూ పురాణాల్లో శంబల నగరాన్ని భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారట.


 అయితే పురాణాల్లో కొందరు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఎవరెస్ట్ పర్వతం అడుగున ఓ సొరంగ మార్గం ఉంటుందట   దాని గుండా వెళ్తే గడ్డ కట్టిన మంచు నది ఉంటుందట. దాని అడుగున ఓ సొరంగం ఉంటుందట. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుందట. దానిలో ఓ గుహ వస్తుంది. ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారట. వారిని దాటుకొని వెళ్తే మంచు కొండల మధ్య స్పటిక పర్వతం శ్రీ చక్రం కనిపిస్తాయట. ఈ స్పటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరమే శంభాల అని చరిత్రకారులు, పురాణాలు చెబుతున్నాయి. ఇక 13వ దళైలామ తన గురువు తాసిలామాతో కలిసి రాసిన తాళపత్ర గ్రంధాల్లో కూడా శంబల  నగరానికి సంబంధించి ఎన్నో ఒక రహస్యాలు ఉన్నాయట. అంతేకాదు షంబల నగరంలో నిత్య యవ్వనాన్ని ప్రసాదించి ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయట.

 శంబల నగరానికి ఎవరైనా వెళ్లారా..

 
 1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు గూడాచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారట. ఈ క్రమంలోనే ఈ ప్రయాణంలో చూసిన వింతలు అన్నిటిపై కూడా వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారట. అప్పట్లో ఇది పెను సంచలనమే అయింది. నివేదిక చదివాక ఎంతోమందిలో శంబల ను చూడాలని ఆశ కలిగి.  ప్రయత్నాలు కూడా చేశారు  అయితే భారతీయ సంప్రదాయాలకు మంత్రముగ్దులు అయినా రష్యన్ శాస్త్రవేత్త నికులాస్ రోఇచ్  సైతం అటు మరణం వరకు శంబలా నగరం గురించి అన్వేషిస్తూనే ఉన్నారట. అయితే ఇక ఇక్కడ మహిమాన్విత శక్తులు ఉన్నాయని తెలుసుకున్న హిట్లర్ సైతం ఈ శంబల  నగరాన్ని చేరుకునేందుకు ఎంతో మంది గూడచారులను పంపించినప్పటికీ ఎలాంటి సమాచారం అందలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: