సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఎంతోమంది క్రేజీ హీరోలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసి అభిమానుల షాక్ అవుతున్నారు. ఎందుకంటే చిన్నప్పుడు తమ అభిమాన హీరోల ఫోటోలు చూసి ఫ్యాన్స్ సైతం వారిని గుర్తుపట్టలేకపోతున్నారు.


 ఇక ఈ మధ్యకాలంలో ఇలా స్టార్ హీరోల చిన్నప్పటి ఫోటోలకి సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక ఫోటో ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి మరోసారి ఇంటర్నెట్ లోకి వచ్చింది. మెగాస్టార్ పక్కనే ఒక చిన్నోడు అమాయకంగా చూస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఇలా మెగాస్టార్ పక్కన ఉన్న ఈ చిన్నోడు ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఫోటో చూడగానే  మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అనుకుంటున్నారేమో.. అలా అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అతను రామ్ చరణ్ కాదు కానీ మెగా ఫ్యామిలీకి చెందిన మరో స్టార్ హీరో.


 ఇన్ని క్లూస్ ఇచ్చిన మెగాస్టార్ తో ఉన్న ఆ చిన్నోడిని గుర్తుపట్టలేకపోతున్నారు కదా.. అతను ఎవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవికి స్వయాన మేనల్లుడు. రేయ్ అనే సినిమాతో మెగా అనే బ్యాగ్రౌండ్ తో సాయి ధరంతేజ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు . అయితే పిల్ల నువ్వు లేని జీవితం అనేది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయ్. ఆ తర్వాత చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్, విరుపాక్ష సినిమాలతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: