టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నాడు.ఇప్పటికే చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమా లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించాడు గౌతమ్. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి సారించాడు..గౌతమ్ ఎక్కువగా ఓర్పు ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌ను ఆస్వాదిస్తాడు. 3 గంటల వ్యవధిలో 5 కిలోమీటర్ల పాటు ఆపకుండా ఈత కొట్టగలడు. ఇక అప్పుడే గౌతమ్ పెరిగిన హైట్ మహేష్ అభిమానులకు షాక్ ఇస్తోంది. గౌతమ్ అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ నటుల జాబితాలో నిలిచాడు. భారతదేశంలో జన్మించిన ప్రముఖుల ఎలైట్ జాబితాలో కూడా స్థానం పొందాడు.అతను తన సోషల్ మీడియా అకౌంట్లలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అప్పుడే గౌతమ్ 150K ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నాడు.గౌతమ్ తన ఖాళీ సమయంలో పని చేయడానికి ఇష్టపడతాడు.గౌతమ్ క్రికెట్ అంటే చాలాఇష్టం.టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని బాగా ఇష్టపడతాడు.అతని అభిమాన దర్శకుడు రాజమౌళి. ఈ దర్శక దిగ్గజంతో కలిసి పని చేయాలనేది గౌతమ్ కోరిక. రీసెంట్‌గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అదే సమయంలో గౌతమ్ లండన్ లో యాక్టింగ్ కోర్సులు చేస్తున్నాడని సమాచారం. ఇప్పుడిదే లండన్ వేదికగా మొదటి స్టేజి ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు గౌతమ్. రోమియో జూలియట్ నాటకం వేశాడీ స్టార్ కిడ్.

ప్రస్తుతం మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార కూడా లండన్ లోనే ఉన్నారు. వీరి సమక్షంలోనే గౌతమ్ రోమియో జూలియట్ నాటకం వేసినట్లు తెలుస్తోంది. నాటకం అయిపోయిన తర్వాత థియేటర్ బయట దిగిన ఫోటోలను నమ్రతా షేర్ చేసింది. అలాగే ఒక ఎమోషనల్ కోట్ రాసుకొచ్చింది 'బ్యూటిఫుల్ ఈవెనింగ్. లండన్ లో గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. నా కుమారుడు మరింత బాగా చేసాడు. పిల్లలు అందరూ ఈ సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కు కచ్చితంగా రావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదా సాయంత్రాన్ని గడిపాను అని పోస్ట్ చేసింది నమ్రత.ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన పోస్ట్, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మహేశ్ లాగే గౌతమ్ సూపర్ స్టార్ అవుతాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహేశ్ గారాల పట్టి సితార కూడా సినిమా ల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు ప్రకటనల్లోనూ మెరిసిందీ స్టార్ కిడ్. మొత్తానికి మహేష్ వారసులిద్దరూ సినిమా ల్లోకి రావడం ఖాయం అని తెలుస్తుంది. దీనిపై మహేష్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమ ల విషయానికి వస్తే.. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో బిజీగా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. అలాగే జిమ్ లోనే ఎక్కువగా కనిపిస్తూ వర్కవుట్లు చేస్తున్నాడు. త్వరలోనే ఈ షూటింగ్ పట్టాలెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: