టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలకు దూరంగానే ఉన్నది. హిందీలో మాత్రం వరుసగా ఏడాదికి ఐదారు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇటీవల వైవాహిక బంధం లోకి కూడా అడుగుపెట్టింది రకుల్ ప్రీతిసింగ్.. తన ప్రియుడు జాకీభగ్నానీ తో ఇటీవల వివాహం చేసుకుంది .వివాహం తర్వాత కూడా సినిమాలలో కొనసాగిస్తూ ఉన్నది. రకుల్ ప్రీతిసింగ్ భర్త నిర్మాతగా కూడా మంచి పాపులారిటీ అందుకున్నారు.పూజ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.. తాజాగా పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు తమ యజమాని జాకి పైన తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పనిచేసే ఉద్యోగులకు చాలా కాలం నుంచి జీతాలు ఇవ్వలేదని.. దీంతో విసుకు చెందిన ఒక ఉద్యోగి తనకు తన టీం కి ఎలాంటి వేతనాలు సరిగ్గా ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ ద్వారా తెలియజేశారు. కానీ ఈ విషయం పైన కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు.


పూజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన కూలి నెంబర్ వన్, బడే మియా చోటే మియా(1998), ఖామోసి తదితర బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించారు. తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పెద్దగా లాభాలను తీసుకురాలేదు. ఈ క్రమంలో ని ఇతనికి పనిచేసిన ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేరట.. బాలీవుడ్ రూల్స్ ప్రకారం ఏదైనా సినిమా పూర్తి అయిన రెండు నెలల లోపు బకాయిలను చెల్లించాల్సి ఉంటుందట కానీ ఈ బ్యానర్ పైన తెరకెక్కించిన బడే మియా చోటే మియా సినిమా కూడా భారీ ఫ్లాప్ ని మూటకట్టుకుంది. దీంతో తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని అలాగే గతంలో పనిచేసిన వందమందికి కూడా రెండేళ్ల నుంచి జీతాలు ఇవ్వలేదని ఒక ఉద్యోగి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: