హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి సోనాక్షి సిన్హా ఈ నెల 23 వ తేదీన తను ప్రేమించినటువంటి జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకోబోతుంది. వీరి వివాహం ఎంతో మంది బంధువుల మరియు సన్నిహితుల మధ్య ముంబై లోని అత్యంత విలాసవంతమైన భవనంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహ తేదీ అత్యంత దగ్గరకు వచ్చింది. దానితో ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ వీరి పెళ్లి విషయం బయటకు వచ్చాక అనేక వార్తలు బయటకు వచ్చాయి. మొదటగా సోనాక్షి పెళ్లి తన తల్లి మరియు సోదరులకు ఏ మాత్రం ఇష్టం లేదు అని, దానితో వారు ఆమెను ఈ పెళ్లి చేసుకోకు అని చెప్పారు అని, కానీ సోనాక్షి అది ఏ మాత్రం పట్టించుకోకుండా జహీర్ నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో వారు ఈమెపై కోపడినట్లు, దానితో సోనాక్షి వీరిద్దరిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత సోనాక్షి సిన్హా తండ్రి అయినటువంటి శత్రుజ్ఞ సిన్హా , సోనాక్షి మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకోబోతుంది కదా అని ప్రశ్నించినప్పుడు.

ఆమె ప్రేమ గురించి, పెళ్లి గురించి నాకు ఏమీ తెలియదు అని స్పందించాడు. ఇక తాజాగా ఆయన పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. దానితో ఆయన తన కూతురి పెళ్లికి వెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది. ఏవో చిన్న చిన్న మాటలు అనుకుంటాం తర్వాత అన్ని సెట్ అయిపోతాయి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇలా సోనాక్షి సిన్హా పెళ్లిని మొదట చాలా మంది తిరస్కరించారు అని వార్తలు వచ్చిన ఆ తర్వాత మాత్రం అందరూ ఒకటైపోయి ఎంతో కలిసిమెలిసి ఉంటూ ప్రస్తుతం సోనాక్షి వివాహాన్ని జరిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: