మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి సనన్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు నాగ చైతన్య హీరోగా రూపొందిన దోచేయి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ ఈమెకు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. దానితో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

ఈమెకు హిందీ సిని పరిశ్రమలో మంచి అవకాశాలు దక్కడం, ఈమె నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలు సాధించడంతో కృతి క్రేజ్ హిందీలో భారీగా పెరిగింది. దానితో ప్రస్తుతం ఈమె హిందీ సినీ పరిశ్రమలో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ "క్రూ" అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇందులోని ఈమె నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా ఈమె సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పదేళ్ల ప్రయాణంలో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పింది. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... సినీ పరిశ్రమలోకి వచ్చిన పది సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను, ఎదురైన ఎన్నో అవమానాలను అధిగమించి నాలో ఉత్సాహాన్ని పెంచే పనిపై దృష్టి పెట్టడం మొదలు పెట్టాను. నేను ఏ పని చేసినా వృత్తిపరంగా అయిన వ్యక్తిగతంగానైనా చాలా అంకితభావంతో ఉంటాను. ఇప్పుడు అదే నన్ను ముందుకు నడిపిస్తుంది అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks