సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంవత్సరంలో ఎప్పుడూ లేని సందడి కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువ శాతం హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలి అని పక్కా ప్లాన్ చేసుకొని మరి సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అలాగే చాలా కాలం ముందే సంక్రాంతికి తమ సినిమా డేట్ ను లాక్ చేసుకుంటూ కూడా ఉంటారు. ఇక సంక్రాంతికి విడుదల అయిన సినిమాలకి కాస్త టాక్ అటు ఇటు వచ్చిన మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది మేకర్స్ తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడమే కరెక్ట్ అనుకుంటారు.

దానివల్ల సంక్రాంతికి అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా సీనియర్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు చాలా వరకు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విక్టరీ వెంకటేష్ మరికొన్ని రోజుల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాకపోయిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే జెట్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అని మేకర్స్ అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఇక నందమూరి నటన సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ఇప్పటివరకు ఏ సినిమాను మొదలు పెట్టలేదు. కానీ ఒక వేళ ఈ మధ్యలో ఏదైనా సినిమా సెట్ అయితే దానిని ఫుల్ స్పీడ్ గా పూర్తి చేసి సంక్రాంతికి తీసుకురావాలి అని నాగార్జున ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: