మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఉప్పెన" సినిమా దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా ... కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్న ఈ మూవీ ని వ్రిద్దీ సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు ఈ సినిమా యొక్క షూటింగ్ ఆగస్టు నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ దర్శకుడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ మరియు దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలో నటించబోయే చాలా కీలక పాత్రలకు నటీనటులను కూడా బుచ్చిబాబు ఎంపిక చేసుకున్నాడు.

ఇకపోతే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉండబోతున్నట్లు ఆ పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువే అయినప్పటికీ ఈ క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాకి చాలా ప్లేస్ కాబోతున్నట్లు దానితో అంత కీలకమైన పాత్ర కోసం నటుడు సీనియర్ స్టార్ హీరోయిన్ అయినటువంటి రమ్యకృష్ణ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ నటించిన చాలా సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఆమె కూడా పవర్ఫుల్ పాత్రలలో తన అద్భుతమైన నటనతో సినిమాకు మరింత క్రేజ్ ను తీసుకువస్తుంది. దానితో రామ్ చరణ్ సినిమాలో కీలకమైన లేడీ పాత్ర కోసం రమ్యకృష్ణ ను బుచ్చిబాబు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: