రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ బృందం వారు అత్యంత భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తున్నారు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీ బృందం వారు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో అద్భుతమైన అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 27 కోట్లు , ఉత్తరాంధ్ర లో 23 కోట్లు , ఈస్ట్ గోదావరిలో 15 కోట్లు , వెస్ట్ గోదావరి లో 11 కోట్లు , గుంటూరు లో 13 కోట్లు , కృష్ణ లో 13 కోట్లు , నెల్లూరులో 8 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 180 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఏరియాలో కూడా భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఇది ఇలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటాని కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: