టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన దీపికా పదుకొని , దిశ పాటని ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను వేశారు.

అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను కూడా మూవీ బృందం వారు ఇప్పటికే భారీ ధరకు అమ్మివేశారు. ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అత్యంత భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు అత్యంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీలలో కల్కి సినిమా రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 191 కోట్లతో నిలవగా ,  ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి మూవీ 180 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను రెండో తెలుగు రాష్ట్రాలలో దక్కించుకుంది.

ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక వేళ ఈ మూవీ కి బారి బ్లాక్ బాస్టర్ టాక్ రానట్లు అయితే ఇంత మొత్తాన్ని వెనక్కు రాబట్టడం ఈ సినిమాకు కష్టం అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని , ఏ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: