పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు  అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక భారీ  అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ కూడా దీనిపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేస్తున్నాయ్. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసింది టీజర్ ట్రైలర్ పోస్టర్ అన్నీ కూడా సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న డైరెక్టర్ కల్కి కి సంబంధించిన స్టోరీ మొత్తం రిలీజ్

 చేసేసాడు. దీంతో కలిపి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఇటీవల దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండబోతోంది అంటూ ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఈ విషయంలో చిత్ర బృందం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. కల్కి విడుదలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ ను విడుదల

 చేయనున్నారు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ సమయంలో ప్రభాస్ విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచరం.. వాస్తవానికి ప్రభాస్ తన ప్రతి కు ముందు విదేశాలకు వెళ్తుంటాడు. గతంలో సలార్ విడుదలకు ముందు ఇటలీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు కల్కి విడుదలకు ముందు యూరప్ ట్రిప్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి గత ఏడాది సలార్ సినిమాతో భారీ విషయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: