లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలు అతిపెద్ద సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న  కమలహాసన్ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చేశాడు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాల చేసాడు. ముఖ్యంగా తెలుగు తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన 1981లో ఏక్ దుయూజే లియే అనే ఒక హిందీ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.  అలా బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఆయన బాంబే డ్రీమ్ ను కొనసాగించకూడదు అన్న

 ఉద్దేశంతో ఆ పరిశ్రమ నుండి వచ్చేయాలని అనుకున్నాడు. అయితే తాజాగా ఆ విషయంపై ఇప్పుడు పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు.. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నాటి కాలం అలా ఉండేది...నేను హిందీ సినిమాకి పేద బంధువును. నేను నా స్వంత లాండ్రీ నేనే చేసుకోవాల్సిన స్థితి. అలాంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది. వారు (ఉత్తరాది స్టార్లు సెలబ్రిటీలు) నిజంగా చెడిపోయిన ధనవంతులు. రెండున్నరేళ్లపాటు వేచి ఉండి ఒక సినిమాలో నటించగలిగాను.. వారు అయితే

 ఒకేసారి 6 సినిమాలు చేయగలరు. నైతికంగా సాంకేతికంగా చెప్పాలంటే క్యారెక్టర్-బిల్డింగ్‌లో నేను చాలా ఓడిపోయానని అనుకున్నాను. బాలీవుడ్ ని వదిలేయడానికి ఇవన్నీ ఒక కారణం'' అని 2017లో ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో కమల్ హాసన్ అన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్ టు అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో సైతం నటిస్తున్నాడు ఈయన. ఇండియన్ టు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే కల్కి లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఆయన. ఇక ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: