టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలలో నటించగా, ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ ను చాలా త్వరగా పూర్తి చేశారు. ఈ మూవీ ని దాదాపు మూడు, నాలుగు నెలల్లోనే పూర్తి చేసి సంక్రాంతి కి విడుదల చేశారు.

మూవీ తో నాగార్జున మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సారి కూడా నాగర్జున అలాంటి ప్లాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాగర్జున ఏ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్ని కథలను ప్రస్తుతం నాగ్ వింటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున వింటున్న కథలలో ఏదైనా త్వరగా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్న ఒక కథను సెలెక్ట్ చేసి దానిని చాలా త్వరగా పూర్తి చేసి ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నా సామి రంగ ఫార్ములాను మరోసారి ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నా నాగార్జున కు ఈ సారి కూడా అలాంటి సినిమా సెట్ అవుతుందో , లేదో చూడాలి. ఇక నాగార్జున మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈయన నుండి సినిమా అనౌన్స్మెంట్ వస్తుంది అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: