టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన ముద్దుగుమ్మలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని సూపర్ గుర్తింపును దక్కించుకుంది. ఈ మూవీలో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ చిత్రం అనంతరం ఈమెకు తెలుగులో మంచి సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం, ఈమె కూడా తన నటనతో, అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ రావడంతో చాలా తక్కువ కాలంలోనే ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. తెలుగులో ఈమె ఆఖరుగా కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఈమె తెలుగు సినిమా చేయలేదు. 

మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. తెలుగులో మంచి గుర్తింపు ఉన్నా కూడా ఈమె తెలుగు సినిమాలు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఈమె తమిళ, హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది.  సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ ఇప్పటికే అనేక సందర్భాలలో సినిమాలలో తన అందాలను ఆరబోసింది. ఈ మధ్యకాలంలో ఈమె తన సోషల్ మీడియాలో చాలా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా రకుల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ తాజాగా ఇండియన్ 2 మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ జూలై 12 వ తేదీన విడుదల పనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: