గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. చాలా రోజుల నుండి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. గని గాండీవ దారి అర్జున ఆపరేషన్ వాలెంటైన్ ఇలా వరుసగా అన్ని సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోయాడు. అలా ఈ సినిమాల తర్వాత మట్కా అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా వరుణ్  కి సంబంధించిన మరొక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. ఈ సినిమా కంప్లీట్

 చేయకముందే మరొక రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్ తేజ్. రవితేజ కి టచ్ చేసి చూడు వంటి డిజాస్టర్ సినిమాని ఇచ్చిన విక్రం సిరికొండ అనే దర్శకుడు తో వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది. ఇకపోతే ఈ దర్శకుడితో వచ్చే సినిమా ఏఐ నేపథ్యంలో అమెరికాలో జరిగే ఒక ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏఐ అంశాలతో పాటు ఫీల్ గుడ్ అంశాలు కూడా ఉండేలాగా ఈ సినిమా తీస్తున్నారట. అంతేకాదు కద కూడా వరుణ్ తేజ్ కి వినిపించగా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం మరి ఏఐ నేపథ్యంలో సినిమా అంటున్నారు కాబట్టి ఇందులో సైబర్ క్రైమ్ వంటి అంశాలు

 ఉంటాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాతో పాటు మరొక ఫ్లాప్ డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్ తేజ్. ఆ డైరెక్టర్ మరెవరో కాదు మేర్లపాక గాంధీ. uv క్రియేషన్స్ సినిమాను నిర్మించబోతున్నట్లు గా తెలుస్తోంది. మొత్తానికి ఒకేసారి ఇద్దరూ ఫ్లాప్  డైరెక్టర్ల తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు వరుణ్ తేజ్. మరి ఫ్లాప్ డైరెక్టర్ల తో చేస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు బయటకు రాలేదు కానీ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు వరుస ఫ్లాప్ లతో ఉన్న వరుణ్ తేజ్ ఇకముందు అయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: