దేశ వ్యాప్తంగా తన నటనతో ప్రేక్షకులను అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా ఇండియన్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటించగా , లైకా ప్రొడక్షన్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను ఫుల్ జోష్ లో చేస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ ట్రైలర్ను జూన్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ నెల 25 వ తేదీన విడుదల కానున్న ట్రైలర్ కనుక ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ 2 మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇండియన్ మూవీ తెలుగులో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో ఈ సినిమాను తెలుగులో భారతీయుడు 2 అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: