సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె దగ్గుపాటి రానా , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ నటి దగ్గుపాటి రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె బింబిసారా , విరూపాక్ష సినిమాలలో హీరోయిన్గా నటించి ఈ రెండు మూవీలతో కూడా మంచి విజయాలను అందుకుంది. 

దానితో ఈమె వరుసగా తెలుగులో మూడు సినిమాలలో నటిస్తే మూడు కూడా విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ లో సంయుక్త లక్కీ బ్యూటీ గా మారిపోయింది. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ డెవిల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశను మిగిల్చింది. ఈ సినిమాతో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈమెకు మొట్ట మొదటి అపజయం దక్కింది. ఇకపోతే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఓలకబోస్తోంది. 

తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. సంయుక్త తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన  బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: