అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీతో మంచి విజయాన్ని, గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అనుపమకు తెలుగులో అవకాశాలు వరుసగా రావడం మొదలు అయింది.

అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన చాలా సినిమాలలో పద్ధతి గల అమ్మాయి పాత్రలలో, డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చింది. ఇక కొంతకాలం క్రితం ఈమె రౌడీ బాయ్స్ అనే సినిమాలో తన అందాలను భారీగా ఆరబోసింది. అలాగే లిప్ లాక్ సన్నివేశాలలో కూడా పాల్గొంది. ఇక ఈ సంవత్సరం విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో కూడా ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. ముద్దు సన్నివేశాలలో కూడా పాల్గొంది. మరి కెరియర్ ప్రారంభంలో డీసెంట్ పాత్రలలో నటించి ఇప్పుడు మాత్రం అందాలను తెగ ఆరబోస్తున్న ఈనటి ఎందుకు ఇలా చేస్తుందా అని చాలామంది అనుకుంటున్నారు. దీనికి సమాధానాన్ని అనుపమనే చెప్పింది.

కొన్ని రోజుల క్రితం అనుపమ మాట్లాడుతూ... నేను కెరియర్ ప్రారంభంలో డీసెంట్ పాత్రలలో నటించాను. ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తున్నాను. అలా ఎందుకు నటిస్తున్నానా అని చాలామంది అనుకుంటున్నారు. ఒకే రకం పాత్రలలో నటిస్తే బోర్ కొడుతుంది. అలాగే నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకొని అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్నాను. కేవలం క్లాస్ పాత్రలలో కానీ, రొమాంటిక్ పాత్రలలో కానీ నటించాలని నా ఉద్దేశం కాదు. అన్ని రకాలైన పాత్రలలో నటించాలి అనేదే నా ఉద్దేశం. ఒక నటిగా అలా చేస్తేనే గుర్తింపు ఉంటుంది అని ఈమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: