మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. గంగోత్రి వంటి సినిమా టైంలో వీడెం హీరో అన్నవారు కూడా ప్రెసెంట్ వీడు రా హీరో అనేలాగా పేరును సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమాల్ డైరెక్షన్లో పుష్ప 2 చేస్తున్నాడు. 2021లో వచ్చిన పుష్ప సినిమాకి ఇది సీక్వెల్. ఇక పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకుని ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్.

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో దువ్వాడ జగన్నాథం మూవీ కూడా ఒకటి. ఈ చిత్రంలో ఒకపక్క క్లాస్ మరోపక్క మాస్ చూపిస్తూ ప్రేక్షకులను బీభత్సంగా ఎంటర్టైన్ చేశాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్ కి కూడా ఎంతోమంది ఫాన్స్ ఏర్పడ్డారు.  ఇక ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో ప్రజెంట్ ఐరన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న పూజ హెడే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బన్నీ స్టైలిష్ లుక్కి అప్పట్లో పెద్ద ఆర్మీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు.

ఇక తాజాగా ఈ సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఈ మూవీని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు స్పెషల్ పోస్ట్ పెట్టారు. " అందరికీ ఇష్టమైన యాక్షన్ ఎంటర్టైనర్ దువ్వాడ జగన్నాథం సినిమా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐకాన్స్టర్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో మెరవడమే కాకుండా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటుంది " అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ను విడుదల చేసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ని చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: