తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా, ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక విక్టరీ వెంకటేష్ మరికొన్ని రోజుల్లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ ముగ్గురు హీరోలలో చిరంజీవి ఒక మూవీలో నటిస్తూ ఉండగా, బాలకృష్ణ ఒక మూవీలో నటిస్తూ ఒక మూవీని లైన్ లో పెట్టుకొని ఉన్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ మరికొన్ని రోజుల్లోనే ఓ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. వీరి ముగ్గురితో పోలిస్తే నాగార్జున మాత్రం చాలా వెనకబడిపోయాడు. నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన నా సామి రంగ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలం అవుతున్న నాగార్జున తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం పై కూడా క్లారిటీ లేదు. దానితో అక్కినేని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: