తమిళ్ సీనియర్ నటుడు సుందర్ ప్రధాన పాత్రలో హీరోయిన్లు గా మంచి పేరు సంపాదించుకున్న తమన్నా అండ్ రాశి కన్నా మెయిన్ రోల్స్ లో నటించిన అరుణ్మనై 4 చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. సుందర్ డైరెక్షన్లో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ మే మూడవ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ లో ఈ సినిమా బాక్ పేరుతో అడుగుపెట్టింది. ఇక తమిళంలో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ తెలుగులో పెద్దగా ఆడలేదు.

కాగా ఈ సినిమా తాజాగా ఓటీటికి అడుగు పెట్టింది. అయితే ఓటీటీలో తెలుగు వర్షన్ బాక్  దుమ్ము రేపుతుంది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 21వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే తెలుగు లో ఈ మూవీ రెండు రోజుల్లోనే హాట్ స్టార్ ఓటిటి ఇండియా ట్రెండింగ్ లో టాప్ కు చేరుకుంది. ఒరిజినల్ తమిళ్ వర్షన్ ను మించి తెలుగు వర్షన్ దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంలోని ఓ సీన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

ఈ మూవీలో తమన్నా ను ఓ వ్యక్తి కొడుతుంటే ఆమె పిల్లలకు తెలియకూడదని ప్రయత్నిస్తూ ఉంటుంది. తనపై దాడి జరుగుతున్న పిల్లల వైపు నవ్వుతూ చూస్తుంది. ఈ చిత్రంలో ఇది ఎమోషనల్ సీన్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు థియేటర్లలో ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుంది. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం తమిళంలో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అయితే తెలుగు వర్షన్ కు ఓటిటిలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: