పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అవసరంలేని పేరు. ఇటీవలే ఏపీ ఉప ముఖ్యమంత్రి గా నిలిచాడు పవన్. టిడిపి తో చెయ్యి కలిపి కూటమిగా ఏర్పడ్డ జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం పొందాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలు ప్రస్తుతానికి తాత్కాలిక విరామంలో ఉండగా పవన్ తన రాజకీయ పనుల్లోనే బిజీగా ఉన్నారు.

అలా ఈ జూన్ నెల మొత్తంలో కూడా ఫాన్స్ కి కావాల్సిన కిక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని కూడా ప్రపంచానికి మునిపెన్నడూ లేని విధంగా పరిచయం చేస్తున్నాడు. అలా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ వారసులు కలిసి కనిపించడం వంటి విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బేవచ్చంగా వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో బ్యూటిఫుల్ పిక్ బయటికి వచ్చింది.

మరి ఆ పిక్ లో పవన్ భార్య అన్నా లెజినోవా తో పాటుగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పిల్లలు అకిరా అండ్ ఆధ్యా ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఇక ప్రజెంట్ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పిక్ ని చూస్తుంటే రేణు దేశాయ్ కి తన పిల్లలు ద్రోహం చేస్తున్నారనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేణు దేశాయ్ తో అకిరా అండ్ ఆద్య పెద్దగా కలిసి ఉండడం లేదు. ఎక్కువగా తన సవతి తల్లి అయినటువంటి అన్నా లెజినోవా తోనే కనిపిస్తున్నారు. తన సొంత తల్లికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సవతి తల్లి తో ఎక్కువగా కలిసి ఉండడంతో నలుగురు నాలుగు రకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: