మాస్ మహారాజ్ రవితేజ ఈ సంవత్సరం ఈగల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ఈ మూవీ టాగ్‌ లైన్. ఇక ఈ సినిమాను స్టార్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీని గ్రాండ్గా నిర్మిస్తున్నారు.

వివేక్ కుచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక రవితేజ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో షాక్ అండ్ మిరపకాయ వంటి సినిమాలు వచ్చాయి. ఇక తాజాగా వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచునాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా రూపొందింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా.. రవితేజ లెజెండ్రీ యాక్టర్ అమితా పల్స్ లో కనిపించి అలరించాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ అమితాబచ్చన్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ షో రీల్ రిలీజ్ చేశారు.

ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షో రీల్ సాగింది. ఇక ఈ చిత్రంలో రవితేజ లుక్స్ అండ్ యాక్షన్ అదిరిపోయినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓ స్ట్రాంగ్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ కు వెళ్ళింది. ఇక షూటింగ్ స్టార్ట్ లో రవితేజ ఫోటో పోస్ట్ చేస్తూ హరీష్ శంకర్ క్యాప్షన్ కూడా రాసుకోచ్చారు. " ప్రపంచకం లో అందరికీ వయస్ అవుతుంది ఒక్క అన్నయ్యకి తప్ప.. కాశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేశాం త్వరలో హైదరాబాద్లో ల్యాండ్ అవుతాం " అనే క్యాప్షన్ తో ఈ  ట్వీట్  వీటిని పోస్ట్ చేశారు. ఇక ఈ ట్వీట్ కు రవితేజ తాజాగా రియాక్ట్ అయ్యారు. " ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలాగా ఉంది " అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: