టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఆయన.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటాడు.అతనికి నచ్చని విషయంపై భయం లేకుండా ఓపెన్ గా స్పందిస్తుంటాడు. తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం తన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెగిటివ్ రివ్యూల విషయంలో కూడా ఘాటుగా స్పందించాడు. అలాగే గామి సినిమా విషయంలో కూడా కౌంటర్ ఇచ్చాడు.రీసెంట్ గా కల్కి 2898 ఏడీ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన యూట్యూబర్ ను విశ్వక్ సేన్ ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. తన ఇన్ స్టా స్టోరీలో ఆ యూట్యూబర్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండని, అప్పుడు మీతో పాటు మీ ఒపీనియన్‍ కు కాస్త అయినా గౌరవం ఉంటుందని విశ్వక్ సేన్ సవాల్ విసిరారు. 


దీంతో విశ్వక్ సేన్ కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.అదే సమయంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ పై కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రోల్స్ చేస్తున్నారు. కావాలనే ఆయన పోస్టులకు చాలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. విషయం ఏంటంటే విశ్వక్ సేన్.. తన ఇన్ స్టాలో పబ్ లో దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. దీంతో ఓ నెటిజన్ అతనిపై అతిగా ప్రవర్తించాడు. "అన్నా ఫోటో బాగుంది ఓహ్ సారీ సారీ మర్చిపోయా.. ఒపీనియన్ చెప్పాలంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి కదా" అంటూ కామెంట్ చేశాడు.దీంతో ఆ నెటిజన్ ను ట్యాగ్ చేసి 'బాగానే ఎక్స్ ట్రాలు' అంటూ సింపుల్ గా ఇచ్చి పడేశారు విశ్వక్ సేన్. ఇప్పుడు ఆ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా.. పలువురు నెటిజన్లు దానిపై స్పందిస్తున్నారు. ఇంకా రిలీజ్ కాని సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన య్యూటూబర్ కు విశ్వక్ కౌంటర్ ఇవ్వడంలో తప్పు లేదని అంటున్నారు. అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించొద్దని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: