రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న తాజా చిత్రం కల్కి. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ మరియు దీపికా పదుకొనే, దిషా పటాని తదితరుడు కీలకపాత్రను పోషిస్తున్నారు. మంచి స్టార్ డం ఉన్న నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రం పై భారీ స్థాయిలో హైప్స్ ఏర్పడ్డాయి.

ఇక ఈ చిత్రం జూన్ 27 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక మేకర్స్ ఈ మూవీ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో థీమ్ ఆఫ్ కల్కి అనే కొత్త పాటను ఈరోజు ఆవిష్కరించనున్నారు. ఈ పాట రేపు యూట్యూబ్లోకి రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై నార్మల్ ఆడియన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన సెకండ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో పక్కాగా ఈ మూవీ సూపర్ హిట్ గా నిలుస్తుందని మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అదేవిధంగా ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా కల్కి మూవీ నిలుస్తుందని ప్రభాస్ అభిమానులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: