పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి AD 2898' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. కల్కి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ ఎంతో కష్టపడుతున్నారు. ఫ్యాన్స్ కోసం రోజుకో అప్డేట్ ను వదులుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌, ట్రైలర్‌లతో పాటు ఫస్ట్ సింగిల్ ని కూడా విడుదల చేయగా మాస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ నుంచి మరో అప్డేట్ ను కూడా మేకర్స్ వదిలారు..కల్కి థీమ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ తో మేకర్స్ ప్రకటించారు.. కల్కి థీమ్ సాంగ్‌ను  శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మధుర నగరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నాడు.


దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఇకపోతే ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అటు ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఏకంగా 210కి పైగా ఐమాక్స్ షోలలో కల్కి సినిమా ప్రదర్శితం కానుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఇకపోతే ప్రభాస్ మాత్రం సినిమా రెస్పాన్స్ ను స్వయంగా చూడకుండా సినిమా విడుదలకు ముందే యూరప్ ట్రిప్ కు వెళ్ళబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో బాగా బలంగా వినిపిస్తుంది.. మరి ప్రభాస్ ఎప్పుడు వెళ్తున్నాడో ఇంకా తెలియదు.. కానీ ఈ వార్త మాత్రం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: