సినీ పరిశ్రమలోని అత్యంత ఆకర్షణీయమైనజంటలలో ఒకరిగా పరిగణించబడే బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్‌.గత ఏడాది కాలం నుండి మాజీ విశ్వ సుందరి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు సోషల్ మీడియాను ఎంతగా కుదిపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతేకాదు ఈ వార్తలు మరీ ఎక్కువవ్వడంతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల అభిమానులు కూడా ఒకింత బాధకు గురవుతున్నారు.అయితే ఇప్పటికే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చిన ప్రతిసారి ఈ జంట కలిసి కనిపించి అందరి నోర్లు మూయించారు. అయినప్పటికీ వీరి విడాకుల వార్తలు ఆగడం లేదు.

అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ తన విడాకుల వార్తలపై స్పందిస్తూ అవును మేము నిజంగానే విడాకులు తీసుకున్నాం అంటూ మాట్లాడడం అందరిని షాకింగ్ కి గురి చేసింది.అంతే కాదు విడాకుల గురించి అభిషేక్ బచ్చన్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో నిజంగానే ఈ జంట విడిపోతున్నారు అంటూ అందరూ భావిస్తున్నారు.అయితే అభిషేక్ బచ్చన్ చెప్పిన ఒక్క మాట పట్టుకొని అది నిజం అనుకుంటే తప్పులో కాలేసినట్టే.ఎందుకంటే ఆయన మేము విడాకులు తీసుకుంటున్నాం నిజమే అని చెప్పిన మాట ఒకటే విన్నారు. కానీ ఆ తర్వాత ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తో విడాకుల గురించి మాట్లాడుతూ.. మా విడాకులు నిజమే..ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు.. మరి ఆ తర్వాత చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండి.. ఐశ్వర్య కు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో ఒక మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు.

నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మీకు అందరికీ నచ్చేలా ఉండమంటే ఉండలేం. మీ అందరిని ఇంప్రెస్ చేస్తూ ఉండాలంటే ఉండలేను. అలాగే మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు కదా.నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది.నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీడియాలో వచ్చే రూమర్స్ అన్ని నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేను..అంటూ తన విడాకుల వార్తలను ఖండించారు అభిషేక్ బచ్చన్.

మరింత సమాచారం తెలుసుకోండి: