టాలీవుడ్ లో చాన్నాళ్ల తర్వాత మరో భారీ చిత్రం రిలీజవుతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దీనిపై టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పందించారు.అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా కొన్ని కథలు కూడా వింటున్నాడు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది.దానికి కూడా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే నాగ్.. సోషల్ మీడియాలో అంతా యాక్టివ్ గా ఉండడు. ఎప్పుడో బాగా వైరల్ అయినా విషయం మీద తప్ప అస్సలు స్పందించడు. అలాంటి నాగ్ తాజాగా కల్కి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా కల్కి సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
 
ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించావ్ నాగీ (నాగ్ అశ్విన్). మహత్తరమైన మన భారతీయ కథలను వెండితెర పైకి తీసుకువస్తుండడం సంతోషం కలిగిస్తోంది. రిలీజ్ ట్రైలర్ చూసి అచ్చెరువొందాను. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడుతున్నాను. అమితాబ్ బచ్చన్ ఇరగదీశారు... కమల్ హాసన్ అదరగొట్టేశారు. ప్రభాస్... ప్రయోగాలు చేసేందుకు నువ్వు ఏమాత్రం వెనుకాడవు... నీలో ఆ గుణాన్ని నేను అభిమానిస్తాను. ఇక నా ఫేవరెట్ ప్రొడ్యూసర్లు అశ్వినీదత్, స్వప్న, స్వీటీలకు ఆల్ ది బెస్ట్. మీ సత్తా నిరూపించుకున్నారు. చిత్ర బృందానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ నాగార్జున పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

నాగ్.. ఎప్పుడు సినిమాలు గురించి ఇలా మాట్లాడడం చూడలేదు.. అలాంటింది.. ఆయనే కల్కి గురించి ఈ రేంజ్ గా చెప్పాడంటే.. ఇక తిరుగు లేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి2898AD జూన్ 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సినిమా నుంచి రిలీజైన రెండు ట్రైలర్స్.. అంచనాలను ఆకాశానికి తాకేలా చేసాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్ లో చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: