టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన స్వయం కృషితో, పట్టుదలతో, కష్టంతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికి వెళ్లారు. ఇక చిరంజీవి కెరియర్ ను మొదలు పెట్టిన సమయంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. మరియు వారి వారసులు కూడా ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారందరినీ తట్టుకొని నిలబడి తెలుగులో ఒక అద్భుతమైన మాస్ హీరోగా ఈమేజ్ తెచ్చుకున్న చిరంజీవి అంటే చాలామంది ఇష్టపడుతుంటారు.

ఎందుకు అంటే ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, తన పట్టుదలతో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి అతనిని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు. దానితో చిరంజీవికి కేవలం సినీ పరిశ్రమలో, మామూలు అభిమానులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందులో ఒకరు తెలంగాణ రాజకీయ నేత బండి సంజయ్. ఈయన బిజెపి నుండి ఇప్పటికే పలుమార్లు ఎంపీగా గెలిచి తెలంగాణ బిజెపి నేతలలో కీలకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన ఎలక్షన్లలో కూడా బంది సంజయ్ ఎంపీగా గెలవడంతో బిజెపి అధిష్టానం ఈయనకు మంత్రి పదవిని ఇచ్చింది.

దానితో ఈయన తన అభిమాన నటుడు అయినటువంటి చిరంజీవిని కలిశారు. అందుకు సంబంధించిన ఒక పోస్ట్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బండి సంజయ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి అభిమానిని. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను ఇవాళ కలిసాను. నా మంచి కోరుకునే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది అని ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: