ఈవారం విడుదల కాబోతున్న ‘కల్కి 2898’ ట్రైలర్ చూసిన వారికి ఒక సందేహం వెంటాడుతోంది. ఈమూవీలో ప్రభాస్ భైరవ గా మాత్రమే కనిపిస్తాడని కల్కి గా ఈ మూవీ సెకండ్ పార్ట్ లో కనిపించే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. ఏ యుగంలో అయినా దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి తన దుర్మార్గం స్వార్థం నుండి బయట పడడు అన్న పాయింట్ చుట్టూ అల్లపడిన కథగా ఈ మూవీ ఉండబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.మూవీ క్లైమాక్స్ లో దీపికా పదుకొనె కు పుట్టబోయే బిడ్డ మాత్రమే ‘కల్కి’ అన్న అంచనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ ప్రొడక్షన్ కాస్ట్ 450 కోట్లు అయితే పారితోషికాల నిమిత్తం 250 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇందులో 150 కోట్లు ప్రభాస్ పారితోషికం అన్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.  ‘కల్కి 2898’ మూవీకి 1000 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు వాస్తవం అయితే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల కలక్షన్స్ వచ్చి తీరాలి అని అంటున్నారు. ఈ రేంజ్ లో ఈమూవీకి కలక్షన్స్ రావాలి అంటే టోటల్ పాజిటివ్ టాక్ వచ్చి తీరాలి. అయితే ఈ మూవీ కథలో ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ ఎంతవరకు సగటు ప్రేక్షకుడుకి అర్థం అవుతాయి అన్న విషయమై ఈ మూవీ ఘన విజయం ఆధారపడి ఉంటుంది.ఈసినిమాకు సంబంధించి విడుదలకు ముందురోజు అర్థరాత్రి షోల విషయమై కొంత భిన్నాభిప్రాయాలు బయ్యర్లు నిర్మాతలలో ఉన్నట్లు టాక్. ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ పనికట్టుకుని ఈమూవీ పై నెగిటివ్ టాక్ ప్రచారంలోకి అర్థరాత్రి షో నుండి తీసుకు వస్తే ఈమూవీ మొదటిరోజు మొదటి షో నుండి సమస్యలు వస్తాయని అర్థరాత్రి షోలు ఈమూవీకి వేయకూడదు అన్న ఆలోచనలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లుటాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: