విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో తన విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను మెప్పించారు. అటు హీరోగా విలన్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళంలో చిన్న సినిమాగా విడుదలై తెలుగులో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వైజాగ్ వంటి ప్రాంతాలలో కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక నైజాం ఏరియాలో సుమారుగా ఐదున్నర కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టిందట.


మహారాజ సినిమాకు కేవలం మౌత్తు టాకుతోనే ఈ సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు. ఒకవేళ ముందుగానే ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేసి ఉంటే మరింత కలెక్షన్స్ పరంగా రాబట్టేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్స్ పోస్టర్ల పైన కూడా ఎలాంటి హడావిడి చేయలేదు చిత్రబృందం. కంటెంట్ నిజంగా బాగుంటే సోషల్ మీడియాలోనే  సినిమాల గురించి ప్రచారం చేస్తారని చెప్పే దానికి ఈ సినిమానే ఉదాహరణ. అందుచేతనే నూటికి నూరుశాతం కంటెంట్ బాగుండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

గతంలో సినిమా ఎలా ఉన్నా కూడా చూసేవారు కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా చూడడానికి ఇష్టపడడం లేదు ప్రేక్షకులు. దీంతో చాలామంది డైరెక్టర్లు సైతం రివ్యూలు రాయడం పైన కూడా ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం అనేది టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదు భారీ బడ్జెట్ సినిమాలే కనిపిస్తూ ఉన్నాయి.. ఇక సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా ఒక టికెట్ ధరలు చూసి భయపడుతున్నారు.. అలాగే థియేటర్లోకి వెళ్లిన తర్వాత కనీసం 2000 రూపాయల ఖర్చు అవుతుందని భయంతోనే చాలామంది సినిమాలకు వెళ్లడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: