ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచవ్యాప్త థియేటర్ హక్కులను ఈ మూవీ నిర్మాణ సంస్థ అమ్మి వేసింది. అందులో భాగంగా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ఎంత బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల షేర్ కలక్షన్లను సాధిస్తే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ ఏరియాలో ఈ మూవీ కి 27 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఉత్తరాంధ్రలో ఏకంగా 23 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 15 కోట్లు, వెస్ట్ గోదావరిలో 11 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్లు, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 385 కోట్ల ప్రి రియల్లీ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 388 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిపోతుంది. ఈ మూవీ కనుక ప్రపంచవ్యాప్తంగా 388 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించగా , కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: