పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. పవన్ స్టార్ హీరోగా కొనసాగిస్తున్న సమయంలోనే 2014 వ సంవత్సరంలో జనసేన అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఇక ప్రస్తుతం ఈ పార్టీ విజయవంతంగా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను రెండవ పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత విరు కొంతకాలానికి పరస్పర అంగీకారంతో విడిపోయారు. వీరికి అఖీరా నందన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.

ఇక ఇప్పటికే అఖిర యువత దశకు వచ్చేసాడు. దానితో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా అఖీరా నందన్ ను వెంటనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించండి అనే వాదనను వినిపిస్తున్నారు. ఇక అకీరా తల్లి అయినటువంటి రేణు దేశాయ్ మాత్రం ఇప్పట్లో అఖీరా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఉండదు. అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకు అంటే తనకు ఇష్టమైన పని తను చేసుకుంటాడు. తనకు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోతే అతను రాడు అని చెప్పుకోస్తున్నాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం కచ్చితంగా అఖీరా ఇండస్ట్రీకి రావాల్సిందే అనే వాదనను వినిపిస్తున్నారు.

ఇక అకీరా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి మూవీ ని రీమిక్ చేసి అఖీరాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇందులో పవన్ నటన కూడా సూపర్ గా ఉంటుంది. నిజంగానే అకిరామూవీ రీమేక్ తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే అదిరిపోయే రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది అని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: