మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రీతి ముకుందన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ కి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఏ వీ ఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి కొంత కాలం క్రితమే మూవీ బృందం ఓ చిన్న టీజర్ ను విడుదల చేసింది. అది బాగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ట్రోలింగ్స్ కి గురి అవుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ , మలయాళ నటుడు మోహన్ లాల్ , హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ , మోస్ట్ బ్యూటిఫుల్ నాటిమని కాజల్ అగర్వాల్ వీరితో పాటు మరి కొంత మంది నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇలా ఇండియాలో ఉన్న అత్యంత క్రేజ్ కలిగిన ఎంతో మంది నటీనటులు ఈ మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి మాత్రం ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇలా ఇప్పటికే ఎంతో మంది క్రేజీ నటులు నటిస్తున్న ఈ సినిమాలోకి మరో యువ నటుడు జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడు శింబు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం శింబు కు  ఈ సినిమా కథను , తన పాత్ర కథను విపరించినట్లు ఆది తనకు బాగా నచ్చడంతో ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగానే ఈ సినిమాలో శంభు నటిస్తున్నాడో లేదో అనేది తెలియాలి అంటే మూవీ బృందం క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: