తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

సినిమా యొక్క సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులకు ఏకంగా 25 కోట్ల ధర పలికినట్లు సమాచారం. దీనితో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన స్థాయిలో నిలిచినట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే తెలుగు లో స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి సీడెడ్ ఏరియాలో కేవలం 15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరోలలో ప్రభాస్ ఒకరు.

ఈయన ఆఖరుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సీడెడ్ ఏరియాలో 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా చూసినట్లు అయితే సీడెడ్ ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం , రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ల కంటే ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నాడు. ఇక ప్రస్తుతం దేవర సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: