తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. దానితో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ఎంత కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలు తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.41 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.67 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.04 కోట్లు , ఈస్ట్ గోదావరిలో 70 లక్షలు , వెస్ట్ గోదావరి లో 54 లక్షలు , గుంటూరు లో 65 లక్షలు , కృష్ణా లో 56 లక్షలు , నెల్లూరులో 40 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 66 లక్షలు , ఓవర్సీస్ లో 1.16 కోట్లు. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 10.79 కోట్ల షేర్ , 20.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువనే షేర్ కలెక్షన్లను వసూలు చేసిన బ్రేక్ ఈవెన్ ఫార్మలాను మాత్రం టచ్ చేయలేకపోయింది. దానితో ఈ మూవీ విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలో విశ్వక్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక నేహా శెట్టి కూడా ఈ సినిమాలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs