కింగ్ నాగార్జున.. టాలీవుడ్ లో ఈ పేరు చెబితే ఇప్ప‌టికీ కొంద‌రిలో వైబ్రేష‌న్స్ మొద‌లు అవుతాయి. ఒక‌ప్పుడు నాగార్జున అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉండేవాడు. ఆయ‌న‌ని ప్ర‌తి ఒక్క‌రు కూడా చాలా ఇష్ట‌ప‌డేవారు. 60 ఏళ్ళు దాటినా.. ఇప్ప‌టికీ నవమన్మధుడిలా.. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా తన స్థానాన్నిఅలా ప‌దిలప‌ర‌చుకున్నాడు. ఎవ‌రు కూడా నాగార్జున స్థానాన్ని ఎవరూ బర్తీ చేయలేకపోతున్నారు. ఇద్ద‌రు కొడుకుల‌కి పోటీగా సినిమాలుచేస్తూ అల‌రిస్తున్నారు నాగార్జున‌. ఇక మ‌న కింగ్ మాట్లాడినంత నైస్ గా ఇంకా ఏహీరో మాట్లాడలేరేమో. అందుకే ఆయ‌న అభిమానుల‌తో పాటు హీరోయిన్లను కూడా ఇలానే బుట్టలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున.ఇటీవ‌ల నాగార్జున‌కి స‌రైన హిట్స్ ప‌డ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు.వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే నాగార్జున‌కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఎయిర్పోర్టులో ఫ్యాన్స్ తొసేసిన వీడియోపై తాజాగా ఆయన స్పందించారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కాగా దానిపై నాగార్జున స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇంతకి ఏం జరిగిందంటే.. నాగార్జున షూటింగ్లో భాగంగా హీరో ధనుష్తో కలిసి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో దిగిన వారు బయటకు నడుచుకుంటు వస్తున్నారు.ఈ క్రమంలో నాగర్జునను చూసి అక్కడి ఎయిర్పోర్టు సిబ్బందిలో ఒక ముసలి వ్యక్తి క్యూరియసిటీతో నాగ్ వైపుకు వచ్చాడు. నాగార్జునకు మరింత దగ్గరికి రావడంతో పక్కనే ఉన్న బాడిగార్డ్ ఆయనను పక్కకు నెట్టారు. దీంతో ఆయన అదుపు తప్పి పడపోయాడు. ఇంతలో బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన కాస్తా నాగార్జున దృష్టికి వెళ్లింది. దీంతో స్వయంగా 'కింగ్' ఈ వీడియోపై స్పందించారు.

"ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగాల్సింది కాదు!! నేను ఆ పెద్దాయనికి క్షమాపణలు చెబుతున్నా. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను!!" అంటూ నాగార్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్    అవుతుంది. నాగార్జున ఈ వీడియోపై స్పందించడం.. ఫ్యాన్స్ని క్షమాపణలు అడగడంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ నాగ్పోస్ట్  పై స్పందిస్తూ ఇలా కామెంట్స్ చేశారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు సార్. మీ రెస్పాక్ట్, గౌరవానికి నా అభినందనలు. కానీ అక్కడ తప్పు బౌన్సర్ ది. మీరూ క్షమాపణలు చెప్పడమేంటి సార్" అంటూ కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం నాగార్జున డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు.తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్లో భాగంగా నాగార్జున, ధనుష్లు కలిసి హైదరాబాద్ ఎయిరోపోర్టుకి చేరుకున్న క్రమంలో ఈ ఎయిర్పోర్టులో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: