మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో.వరుణ్  తేజ్ కెరీర్ పెద్ద గొప్పగా ఏమీ లేదు. కథా పరంగా వైవిధ్యాలు, ప్రయోగాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. రీసెంట్ గా అతను చేసిన సినిమాలు ఏమీ ఆడలేదు.నిర్మాతకు రూపాయి తెచ్చిపెట్టింది లేదు. కెరీర్ మొదట్లో అతనికి తొలిప్రేమ, ఫిదా లవ్ స్టోరీలు బిగ్ హిట్స్ ఇచ్చాయి. అవే ఇప్పటికి చెప్పుకోవాల్సిన పరిస్దితి. 'తొలిప్రేమ' తర్వాత గద్దలకొండ గణేష్, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సీరియస్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మట్కా' కూడా సీరియస్ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, దర్శకుడు విక్రమ్ సిరికొండ నూతన స్క్రిప్ట్ ని వరుణ్ తేజ్ ఓకే చేసినట్లు సమాచారం.

విక్రమ్ సిరికొండ మరెవరో కాదు. గతంలో రవితేజ 'టచ్ చేసి చూడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినా వరుణ్ కు ఈ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.కథ కొద్దిపాటి లవ్ స్టొరీ తో కూడిన యాక్షన్ తో సాగుతుందిట. కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు విక్రమ్ సిరికొండ. తరువాత సినిమా ఇండస్ట్రీపై ఆసక్తితో 'కొంచం ఇష్టం కొంచం కష్టం' సినిమాకు రచయితగా పనిచేశారు. అలాగే 'ఠాగూర్' సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాక కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ విభాగంలో వర్క్ చేశారు. టచ్ చేసి చూడు సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నా మంచి కథతో వచ్చారని తెలుస్తోంది. హిట్ కొడితే ఇటు వరుణ్ తేజ, అటు తను ఇద్దరూ ఒడ్డున పడతారు. మరోవైపు వరుణ్ తేజ ప్రస్తుతం చేస్తున్న మట్కా సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: