మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య అంతరం అలాగే ఉందా? ఇరు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోలేదా? కొన్ని కారణాల వల్ల ఏర్పడిన గ్యాప్‌ ఇప్పటికీ కొనసాగుతోందా?అవుననే అంటున్నారు ఇరు కుటుంబాల సన్నిహితులు. అందుకు కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఫంక్షన్లు, పండుగలు కలిసి చేసుకున్నా, కలిసే ఉన్నాం అని ఫొటోలు షేర్‌ చేస్తున్నా... తాజా పరిణామాలు చూస్తే ఇరు కుటుంబాల మధ్య అంతరం అలాగే ఉందనిపిస్తుంది. ఎన్నో రకాలుగా క్లారిటీ ఇచ్చినా ఆ మచ్చ మానట్లేదు. పాతతరం మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవచ్చు.. ఈతరం హీరోల మధ్య ఉన్నాయనే అనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే. సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో మనం చూస్తున్నాము.. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పొలిటికల్ పరంగా టచ్ చేసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆయనను పర్సనల్గా అటాక్ చేస్తున్నారు.పుష్ప2 సినిమా విషయంలో ఎంత రచ్చరంబోలా చేసి రాద్ధాంతం సృష్టించి ఫైనల్లీ సినిమాను పోస్ట్ పోన్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు అందరికీ తెలిసిందే . ఈ ఒక్క విషయం బన్నీ ఫాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది . పుష్ప2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సి ఉండగా అది ఏకంగా డిసెంబర్ 6 వాయిదా పడింది .

 అయితే ఇప్పుడు సినిమా విషయంగా ఒక క్లారిటీ కొచ్చేసిన బన్నీ పర్సనల్ ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండేందుకు మెగా ఫ్యామిలీతో మింగిల్ అవ్వాలని ట్రై చేస్తున్నారట. అంతేకాదు దీనికోసం మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన హీరోని రంగంలోకి దించుతున్నారట . ఆ హీరో ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ - మెగాస్టార్ చిరంజీవి - నాగబాబులతో ఒక సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారట .జరిగింది జరిగిపోయింది ..తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది.. ఇకపై అలాంటి తప్పు జరగకుండా పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలి అల్లు మెగా ఫ్యామిలీల మధ్య వార్ వద్దు అనే విధంగా ఈ ఇష్యూ ని రాజీ చేసుకోబోతున్నారట . దీనికోసం ఆ స్టార్ హీరో బాగానే ట్రై చేస్తున్నాడట. ఇది తెలుసుకున్న జనాలు మాత్రం అంటే ఇప్పుడు ఆ హీరోని బ్రోకర్ గా మార్చేసారా..? అంటూ వ్యంగ్యంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ ఎంతవరకు అల్లు అర్జున్ చేసిన పనిని క్షమిస్తుందో తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ చేసిన పనిని అంత ఈజీగా మర్చిపోరు అంటున్నారు జనాలు. ఏమో ఈ గొడవలు ఇంకా ఎంతవరకు వెళ్తాయో ఎక్కడికక్కడ మర్చిపోతేనే అందరికీ హ్యాపీగా ఉంటుంది అంటూ పలువురు సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ గొడవలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: