ఒకప్పుడు యంగ్ హీరోలకి జోడిగా నటించిన హీరోయిన్ కామ్నా  అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఈమె అప్పట్లో చాలామంది యంగ్ హీరోలకి జోడిగా నటించి భారీ గుర్తింపును సంపాదించుకుంది. అప్పట్లో ఈమెకి సపరేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లరి నరేష్ తో ఈమె రెండు మూడు సినిమాల్లో నటించింది. అలా వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈమె మొదట తమిళంలో జయం రవికి జోడి నటించిన ఇదయ తిరుదాన్ అని సినిమాతో

  ఇండస్ట్రీకి పరిచయమైంది. దాని తర్వాత గోపీచంద్ నటించిన రణం అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఆ సినిమా తర్వాత వరస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొని హీరోయిన్గా  పేరు తెచ్చుకుంది .అంతేకాదు ఎక్కువగా గ్లామర్ పాత్రలను చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలని చేసేది. అలా తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే వరుసగా విజయాలను అందుకున్న ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అలా కొన్ని ఏళ్లు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది ఈమె. ఆ తర్వాత ఊహించని విధంగా ఈమె చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్

 అవడం మొదలయ్యాయి. అలా పలు  సినిమాలు చేసి సక్సెస్ కాకపోవడంతో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  నటించింది. ఆ తర్వాత  2014లో బెంగుళూరుకు చెందిన బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకుని కామ్నా జెఠ్మలానీ పూర్తిగా లకు దూరమయ్యింది. కాగా, ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత మరోసారి సినీ ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఇచ్చింది ఈ అందాల భామ. 2022లో గరుడ అనే కన్నడ లో.. అలాగే 2023లో వ్యవస్థ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. మరోవైపు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంది కామ్నా జెఠ్మలానీ. అందాలు ఆరబోస్తూ.. తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: