జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లుగా అప్పట్లో దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పార్ట్ వన్ సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్

 హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్ .ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా విడుదల చేస్తూ దీనిపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో

 ఆకట్టుకున్నాయి.ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అయిన “ఫియర్ సాంగ్ ” ను రిలీజ్ చేసారు.”దూకే ధైర్యమా జాగ్రత్త ..దేవర ముందు నువ్వెంత ” అంటూ సాగె ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి థాయిలాండ్ వెళ్లగా తాజాగా నేడు హైదరాబాద్ చేరుకున్నాడు.ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతువుంది.తాజాగా ఎన్టీఆర్ మరింత స్టైలిష్ గా కనిపించారు.వైట్ టి షర్ట్ లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అలరించాడు.ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: