ఒకప్పటి కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు  ఇక ఈయనకున్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఒకప్పటి కమెడియన్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు ఆయన కామెడీ రోల్స్ చాలా తక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విలన్ పాత్రలో మైమరిపిస్తున్నారు. ఎక్కువగా విలన్ పాత్రలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ఆయనకి వస్తున్న ఆఫర్స్ కూడా ఎక్కువగా విలన్ పాత్రలకే వస్తున్నాయి. అందుకే ఒకప్పటి కమెడియన్ అని అన్నాను. అయితే ఒకప్పుడు ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు

 ఆయన కామెడీ రోల్స్ చేశారు. అంతేకాదు మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలు చేశాడు. అలా హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఆయన ఉన్నట్టుండి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చారు. అలా కమెడియన్ గా ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. అలా కొన్ని ఏళ్లు కమెడియన్గా సాగిన ఆయన ఇప్పుడు కేవలం విలన్ పాత్రలు మాత్రమే చేస్తున్నాడు. అంతేకాదు చాలామంది స్టార్ దర్శక నిర్మాతలు పెద్దపెద్ద సినిమాల్లో ఆయనను విలన్ పాత్రల్లో ఎంచుకుంటున్నారు. అలా ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలవుండగా సినిమాలో తన పాత్రని బట్టి

 రెమ్యునరేషన్ తీసుకునే సునీల్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న దాని కన్నా ఇప్పుడు విలన్ గా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ కి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. విలన్ వేశాలకు ఐదు కోట్లా అని ఆశ్చర్యపోవచ్చు. సునీల్ కి ఉన్న స్టార్ క్రేజ్ ని అది వాలిడే అని చెప్పొచ్చు. సునీల్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ పుష్ప 2 లో మంగళం శ్రీను పాత్రలో మరోసారి అదరగొట్టబోతున్నాడు సునీల్. అలా ప్రస్తుతం విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ వంటి సినిమాల్లో కూడా చేస్తున్నాడు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దోసుకుపోతున్నాడు సునీల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: