రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా కల్కి రిలీజ్ కి ఇంకా 3 రోజుల టైం ఉన్నా ఇప్పటికే ఈ సినిమా గురించి సోషల్ మీడియా అంతా కూడా హంగామా మొదలైంది. సినిమాకు బుకింగ్స్  ఓపెన్ అవ్వడమే ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.కల్కి మూవీ కోసం నాగ్ అశ్విన్ పడిన 3 ఏళ్ల కష్టానికి రిలీజ్ ముందే ఇలాంటి పాజిటివ్ బజ్ రావడం అనేది అందరినీ కూడా సంతోషపరుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పై ప్రత్యేకంగా కోలీవుడ్ సెలబ్రిటీస్, ఆడియన్స్ పాజిటివ్ గా మాట్లాడటం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ సినిమాలని తప్ప మిగతా ఇండస్ట్రీ సినిమాలని పెద్దగా పట్టించుకోరు.కల్కి రిలీజ్ ట్రైలర్ చూశాక అక్కడ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, శింబు ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎక్స్ వేదికగా కల్కి గురించి తమ స్పందన తెలియచేశారు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారని సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 


తెలుగు సినిమా పాన్ వరల్డ్ వైడ్ చేస్తున్న సంచలనానికి పక్కనే ఉన్న తమిళ పెద్దలు కాస్త అప్సెట్ అవుతున్నారన్న వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.కానీ ఒక మంచి సినిమా అనేది వస్తే దాన్ని మనస్పూర్తిగా అభినందించాల్సిందే అంటూ కోలీవుడ్ నుంచి కొందరు దర్శకులు కల్కి మూవీ కోసం స్పెషల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించడం తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మన తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారు. భాషతో సంబంధం లేకుండా అసలు సినిమాలో నటీనటులు ఇంకా దర్శకుడు ఎవరో తెలియకపోయినా సినిమాను ఆదరిస్తారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ నటించాడు కాబట్టి తమిళ సెలబ్రిటీస్ కల్కి ప్రస్తావన తెచ్చారంటే నమ్మలేం. ఒక మంచి సినిమా అది కూడా సౌత్ ఇండియన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని శాసించేలా వస్తుంటే కచ్చితంగా అందరు దానికి స్వాగతం చెప్పక తప్పదు.ఇలా కల్కి విషయంలో తమిళ దర్శకులు, హీరోలు చేస్తున్న ఈ పాజిటివ్ ప్రమోషన్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: