విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఖుషి తో బిలో యావరేజ్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లాంటి రాడ్డు ప్లాప్ అందుకోవడం అతని ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది.ఎందుకంటే గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి పరశురామ్ మీద కాన్ఫిడెన్స్ తో వెళ్లిపోయాడు విజయ్. ఐతే పరశురాం మీద విజయ్ పెట్టుకున్న నమ్మకాన్ని డైరెక్టర్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లోనే కొత్త వారితో సినిమాలు చేయనని అన్న విజయ్ స్టేట్ మెంట్ కూడా ఈ సినిమాపై నెగటివిటీ తీసుకొచ్చింది.ఐతే విజయ్ కూడా ఒకప్పుడు కొత్త వాడే కదా అని నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేశారు.అయితే విజయ్ కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో ఆ మాట అనలేదు. 


తనకున్న మార్కెట్ కొద్దీ నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నప్పుడు సినిమాను బాగా హ్యాండిల్ చేసే విధంగా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడైనా చాలనే ఉద్దేశ్యంతో అన్నాడు. సినిమా తీస్తే చాలు అది హిట్టా ఫ్లాపా కాదు తనకు నచ్చిన కథ తెస్తే అతనితో సినిమా చేస్తానని కూడా అన్నాడు విజయ్ దేవరకొండ.ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యన్ లాంటి దర్శకులను కూడా లైన్ లో పెట్టాడు. ఇదిలా ఉంటే రాహుల్ సంకృత్యన్ తో విజయ్ చేసే సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ టాక్సీవాలా సినిమాతో కలిసి హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ, రాహుల్ మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ సినిమా కథ, కథనం అంతా కూడా రాహుల్ భారీ ప్లానింగ్ తో తీస్తున్నాడని తెలుస్తుంది. ఇంకా అంతేకాదు విజయ్ దేవరకొండ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమాగా ఈ సినిమా నిలుస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: