పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా కల్కి రిలీజ్ కి ఇంకా 3 రోజుల టైం ఉన్నా ఇప్పటికే ఈ సినిమా గురించి సోషల్ మీడియా అంతా కూడా హంగామా మొదలైంది. సినిమాకు బుకింగ్స్  ఓపెన్ అవ్వడమే ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.కల్కి మూవీ కోసం నాగ్ అశ్విన్ పడిన 3 ఏళ్ల కష్టానికి రిలీజ్ ముందే ఇలాంటి పాజిటివ్ బజ్ రావడం అనేది అందరినీ కూడా సంతోషపరుస్తుంది.  మేకర్స్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా జోష్ పెంచారు. ఈవెంట్స్ తక్కువగా నిర్వహించి.. వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీ పై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.ట్రైలర్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. రిలీజ్ ట్రైలర్ తో ఆ అంచనాలన్నీ ఆకాశాన్ని తాకేలా చేశారు.ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మేకర్స్.. ఈ సినిమాలో రోల్స్ చేసిన ఒక్కొక్కరి లుక్స్ ను రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే.


అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే భైరవ ఆంథమ్‌ సాంగ్‌ రిలీజ్ చేయగా.. నార్త్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో మాత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. రీసెంట్ గా కల్కి థీమ్ సాంగ్‌ ను శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర నగరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లు ఈరోజు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.ఇక కల్కి థీమ్ సాంగ్ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచేలా ఉంది. ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే మధురలోని యమునా నది ఒడ్డున సీనియర్ హీరోయిన్ శోభనతో పాటు మరికొంతమంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ కోసం స్పెషల్ వీడియో షూట్ చేశారు మేకర్స్. అందులో అంతా భరతనాట్యం చేస్తూ చాలా బాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా శోభన.. క్లాసికల్ గెటప్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో అదరగొట్టారు. తన డ్యాన్స్ తో ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం శోభన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: