కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు డైరెక్టర్ అట్లీ. తమిళ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే వైవిద్య భరితమైన కథలతో సరికొత్త సినిమాలను తీస్తూ ఉంటాడు ఈ డైరెక్టర్. ఇకపోతే ఈయన చేసిన రాజారాణి తేరి బిగిల్ జవాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్  వద్ద సంచలన వసూళ్లు  అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా అట్లీ ఐకాన్ స్టార్

 అల్లుఅర్జున్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి  కానీ ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయితే అట్లీ మాత్రం బన్నీతో ఎటువంటి సినిమా చేయడం లేదు అంటూ ఇటీవల తేల్చి చెప్పేసాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఇలా చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ని పక్కన పెట్టేసి సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలి అన్న ఉద్దేశంతోనే అల్లు అర్జున్ తో

 సినిమాని అట్లీ క్యాన్సల్ చేశాడు అంటూ బన్నీ అభిమానులు ఆయనపై విపరీతంగా కోపంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ట్రోల్స్ చేయడం కూడా ప్రారంభించారు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరోవైపు  బన్నీ పర్సనల్ లైఫ్ లో వివాదాలు త్వరగా సద్దుమణిగితే మంచిదని అంత భావిస్తున్నారు. లేకపోతే చాలా వరకు సినిమాల పరంగాను ఆయనకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. అలాగే ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప 2 తో భారీ సక్సెస్ అందుకఉంటే ఒకే. లేదంటే ఆయన మరోసారి కెరీర్ పరంగా భారీ డౌన్ ఫాల్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: